1. దానశీలం
కవి - బమ్మెర పోతన
(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)
పద్యం 4 (చదవండి)
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై
బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!
పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కారే రాజులు?- రాజ్యముల్ కలుగవే?- గర్వ ఉన్నతిన్ పొందరే?-
వారు ఏరీ- సిరి మూటగట్టుకొని పోవన్ చాలిరే?- భూమిపై-
పేరైనన్ కలదే?- శిబి ప్రముఖులున్ -ప్రీతిన్ -యశఃకాములై-
ఈరే కోర్కులు? -వారలన్ మరచిరే- యిక్కాలమున్- భార్గవా!
పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)
కారే రాజులు = రాజులు కాలేరా?
రాజ్యముల్ కలుగవే? = రాజ్యాలు కలిగిలేరా?
సిరి = సంపద
పోవంజాలిరే = పోగలిగారా?
ప్రీతిన్ = ప్రియంతో
యశఃకాములై = కీర్తిని కోరుకున్నవారై
ఇక్కాలం = ఈ కాలం
భార్గవా = ఆచార్యా
పద్య భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
భావం: (చదవండి)
ఆచార్యా! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు కలిగి ఉన్నారు. వారు ఎంతో గర్వంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా!