1. దానశీలం
కవి - బమ్మెర పోతన
(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)
కవి వివవరములు (చదవండి)
పాఠ్యభాగ కవి: బమ్మెర పోతన
కాలం : 15వ శతాబ్ది
ప్రాంతం : ఓరుగల్లు(వరంగల్లు) సమీపంలోని బమ్మెర గ్రామం
రచనలు: ఆంధ్రమహా భాగవతం, భోగినీ దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం
బిరుదులు : సహజపాండితుడు
ప్రత్యేకతలు: పోతన భక్తకవి, శబ్ధాలంకార ప్రియుడు. పోతన భాగవతం లోని గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లద చరిత్ర, వామనావతారం ఘట్టం జనాల్లో చాలా ప్రసిద్ధి పొందాయి. తన భాగవతం గ్రంథాన్ని రాజులకు అంకితం ఇవ్వకుండా శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. రాజులను ఆశ్రయించకుండా స్వయంగా వ్యవసాయం చేసుకొని జీవించిన ధన్యుడు.
పద్యం 1 (చదవండి)
కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలతిం బోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాడముం
గలడే మాన్ప నొకండు? నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!
పద్యాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంభరుండు,
అలతిన్ పోడు, త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాడమున్,
కలడే మాన్పను ఒకండు? నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్,
వలదు ఈ దానము గీనమున్; పనుపుమా.. వర్ణిన్ వదాన్యోత్తమా!
కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)
తేజమున్ = తేజస్సు (పరాక్రమం)
ఈ కుబ్జుండు = ఈ యొక్క పొట్టివాడు (విష్ణువు)
విశ్వంభరుండు = విశ్వమంతా భరించగలిగేవాడు
అలతిన్ పోడు = కొంచెంతో పోయేవాడు కాడు
త్రివిక్రముడు = ముల్లోకాలను ఆక్రమించగలవాడు
స్ఫురణవాడు = అనిపించేవాడు
బ్రహ్మాడమున్ = బ్రహ్మాండమంతా
మాన్పను = ఆపగల్గను
ఆకర్ణింపు = విను
కర్ణంబులన్ = చెవులొగ్గి (చెవులతో)
దానము గీనమున్ = దానంగీనం
పనుపుమా.. = పంపించుము
వర్ణిన్ = బ్రహ్మచారిని
వదాన్యోత్తమా! = దాతల్లో ఉత్తముడా!
పద్య భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
భావం: (చదవండి)
దాతల్లో శ్రేష్ఠుడా! బలిచక్రవర్తీ! నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో! ఈ పొట్టివాడు మహావిష్ణువులా తోస్తున్నాడు. కొద్దిగా తీసుకొని వెళ్లిపోయేవాడు కాడు. మూడడుగుల పేరుతో ముల్లోకాలను ఆక్రమించే త్రివిక్రముడు అవుతాడు. బ్రహ్మాండం నిండిపోతాడు. ఎవరైనా ఆతని ఆపగలరా? నామాట వినుము. ఈ దానం గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించివేయి.
2 comments:
Nice
Very useful
Very useful sir tq🙏
Post a Comment