1. దానశీలం
కవి - బమ్మెర పోతన
(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)
పద్యం 9 (చదవండి)
లెమ్మా! నీ వాంఛితంబు లేదన కిత్తుం
దెమ్మా! యడుగుల నిటు రా
నిమ్మా! కడుగంగవలయు నేటికి దడయన్?
పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
రమ్మా! మాణవక ఉత్తమ!
లెమ్మా! నీ వాంఛితంబు- లేదనక ఇత్తున్-
తెమ్మా! అడుగులన్- ఇటు రా
నిమ్మా!- కడుగంగవలయు - నేటికి తడయన్?
పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)
మాణవకోత్తమ = మానవుల్లో శ్రేష్ఠుడా
లెమ్ము = సిద్ధం కా
వాంఛితంబు = కోరిక
తెమ్మా = తేవయ్యా
అడుగులన్ = పాదాలను
తడయన్ = ఆలస్యమేలా ?
పద్య భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
భావం: (చదవండి)
ఓ మానవోత్తమా! లేవయ్యా! ఇటు రావయ్యా! నీవు కోరినది లేదు అనకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీ పాదాలను ఇటువైపు ఉంచు. కడుగాలి. ఇంకా ఆలస్యం ఎందుకు?
0 comments:
Post a Comment