22 May 2021

దానశీలం 10వ తరగతి తెలుగు పద్యం-7 రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం మరియు అర్థం చేసుకోవడానికి శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారిచే

1. దానశీలం 

కవి - బమ్మెర పోతన

(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)

 పద్యం  7 (చదవండి)

బ్రతుకవచ్చుగాక బహు బంధనములైన

వచ్చుగాక లేమి వచ్చుగాక

జీవధనములైన జెడుగాక పడుగాక

మాట దిరుగలేరు మానధనులు

పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


భావయుక్తంగా:(చదవండి)

బ్రతుకవచ్చుగాక, బహు బంధనములు ఐన

వచ్చుగాక, లేమి వచ్చుగాక,

జీవధనములు ఐన చెడుగాక, పడుగాక

మాట తిరుగలేరు మానధనులు

పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)

బంధనములు     =    ఆటంకాలు (కష్టాలు)

లేమి     = పేదరికం

జీవధనములు   =  ప్రాణాలుయును ధనముయును

జెడుగాక    =  నశించుగాక

పడుగాక     =  అంతమై పోదుగాక

మానధనులు    =  మానమే ధనముగా గలవారు (అభిమానవంతులు)

పద్య  భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావం: (చదవండి)

         బాగా బ్రతికినా, కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి, ధనానికి చేటువచ్చినా, చివరకు మరణమే సంభవించినా అభిమానవంతులు మాట తప్పలేరు.


0 comments:

Latest Updates

Class 10

Class 9

Class 8

Class 7

Class 6

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Children's Work

Top