22 May 2021

దానశీలం 10వ తరగతి తెలుగు పద్యం-6 రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం మరియు అర్థం చేసుకోవడానికి శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారిచే

1. దానశీలం 

కవి - బమ్మెర పోతన

(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)

 పద్యం  6 (చదవండి)

నిరయంబైన నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు

ర్మరణం బైన గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;

హరుడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌ;

దిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా! ధీవర్య వేయేటికిన్?

పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


భావయుక్తంగా:(చదవండి)

నిరయంబు ఐన- నిబంధము ఐన- ధరణీ నిర్మూలనంబు ఐన- దు

ర్మరణంబు ఐన- కులాంతము ఐన- నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;

హరుడు ఐనన్- హరి ఐనన్- నీరజభవుండు -అభ్యాగతుండు ఐనన్ ఔ;

తిరుగన్ నేరదు -నాదు జిహ్వ -వినుమా! ధీవర్య -వేయి ఏటికిన్?

పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)

నిరయము     =  నరకం

నిబంధం        =  బంధనం

ధరణీ         =    భూమండలం

నిర్మూలనం     = నాశనం

కులాంతమైన     =  కులం అంతరించి పోయినా

హరుడు     =    శివుడు

హరి       =    విష్ణువు

నీరజభవుండు    =   బ్రహ్మ (నీరజం నుండి పుట్టినవాడు)

అభ్యాగతుండు      =  సమయానికి వచ్చిన అతిథి

తిరుగన్ నేరదు     =  వెనుదిరగలేదు

జిహ్వ      =    నాలుక

ధీవర్య     =  పండితోత్తమా!

వేయేటికిన్     =   వేయి మాటలెందుకు?

పద్య  భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావం: (చదవండి)

         ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే, బంధనాల్లో ఇరుక్కున్నా సరే. ఈ భూమండలం నశించినా, నాకు మరణం సంభవించినా, నా వంశం అంతరించినా సరే! ఏమైనా కానీ, ఏదైనా రానీ! ఆడిన మాట తప్పను. వచ్చినవాడు శివుడైనా, విష్ణవైనా, బ్రహ్మయైనా.. ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరగదు. వేయి మాటలు ఎందుకు?


0 comments:

Latest Updates

Class 10

Class 9

Class 8

Class 7

Class 6

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Children's Work

Top