1. దానశీలం
కవి - బమ్మెర పోతన
(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)
పద్యం 5 (చదవండి)
ఉడుగని క్రతువుల వ్రతముల
బొడగన జననట్టి పొడవు పొడవున గుఱచై
యడిగెడి నట; ననుబోటికి
నిడరాదె మహానుభావ ! యిష్టార్థంబుల్..
పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
ఉడుగని క్రతువుల -వ్రతములన్-
పొడగనన్ చననట్టి- పొడవు- పొడవున కుఱచై-
అడిగెడి నట; ననుబోటికిన్-
ఇడరాదె- మహానుభావ !- ఇష్ట అర్థంబుల్..
పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)
ఉడుగని = ఎడతెగని
క్రతువులు = యజ్ఞాలు
పొడ = రూపం (ఆనవాలు)
పొడవు = గొప్పనైన
కుఱచై = పొట్టివాడై (సామాన్యుడై)
ననుబోటికి = నా బోటివానికి
ఇష్టార్థంబుల్ = కోరిన కొర్కెలు
పద్య భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
భావం: (చదవండి)
ఓ మహానుభావా! ఎడతెగని యజ్ఞాలు, పుణ్యవ్రతాలు ఎన్ని చేసినా కనిపించనివాడు ఆ మహావిష్ణువు. అంతటి మహా గొప్పనైనవాడు నా వంటివాని వద్ద చిన్నవాడిగా మారి అడుగుతున్నాడు గదా! ఆతడు కోరినదానిని ఇవ్వకుండా ఉండగలమా?
0 comments:
Post a Comment