1. దానశీలం
కవి - బమ్మెర పోతన
(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)
పద్యం 3 (చదవండి)
ధాత్రిని హలికునకును సు
క్షేత్రము బీజములు నొకట జేకురు భంగిం
జిత్రముగ దాత కీవియు
బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే!
పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
ధాత్రిని హలికునకును సు
క్షేత్రము బీజములును ఒకట చేకురు భంగిన్
చిత్రముగ దాతకు ఈవియు
పాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే!
పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)
ధాత్రి = భూమి
హలికుడు = రైతు (హాలికుడు)
సుక్షేత్రం = మంచి వ్యవసాయ భూమి
బీజములు = విత్తనాలు
భంగిన్ = విధంగా
దాత = దానం చేసేవాడు
ఈవియు = ఈయగల సంపద
పాత్రము = అర్హుడైన వ్యక్తి
పద్య భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
భావం: (చదవండి)
రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకడము అరుదైనట్లే, దాతకు దానమీయుటకు తగినంత ధనము, స్వీకరించుటుకు ఉత్తముడైన స్వీకర్త లభించే అదృష్టం అరుదే కదా!
0 comments:
Post a Comment