1. దానశీలం
కవి - బమ్మెర పోతన
(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)
పద్యం 2 (చదవండి)
నిజమానతిచ్చితి నీవు మహాత్మక!
మహిని గృహస్థ ధర్మంబునిదియ
యర్థంబు గామంబు యశమును వృత్తియు
నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
నర్థలోభంబున నర్థి బొమ్మనుటెట్లు?
పలికి లేదనుకంటె బాపమెద్ది
యెట్టి దుష్కర్ముని నే భరించెదగాని
సత్యహీనుని మోవజాల ననుచు
బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
సమరమున నుండి తిరుగక జచ్చుకంటె
బలికి బొంకక నిజమున బరుగుకంటె
మానధనులకు భద్రంబు మరియు గలదె
పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
నిజము ఆనతిచ్చితివి- నీవు మహాత్మక!
మహిని -గృహస్థ ధర్మంబును- ఇదియ-
అర్థంబు-కామంబు- యశమును- వృత్తియు-
ఏ అది ప్రార్థింపను -ఇత్తును అనియు-
అర్థలోభంబునన్ -అర్థిన్- పొమ్మనుట ఎట్లు?-
పలికి లేదనుకంటె -పాపము ఎద్ది-
ఎట్టి -దుష్కర్మునిన్- నే భరించెదన్- కాని-
సత్యహీనుని- మోవజాలను- అనుచు
పలుకదే- తొల్లి- భూదేవి బ్రహ్మతోడ-
సమరమున నుండి- తిరుగక- చచ్చుకంటె-
పలికి బొంకక- నిజమున పరుగుకంటె-
మానధనులకు- భద్రంబు- మరియు గలదె
పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)
అర్థం = ధనం
కామం = కోరిక
యశము = కీర్తి
అర్థలోభంబు = ధనంపై దురాశ
అర్థి = యాచించి వచ్చినవాడు
దుష్కర్ముడు = దుర్మార్గుడు
సత్యహీనుడు =
సత్యం లేనివాడు (అసత్యశీలి)
తొల్లి = పూర్వం (గతంలో)
బొంకు = అబద్దాలాడు
మానధనులు = మానమే ధనముగా కలవారు
పద్య భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
భావం: (చదవండి)
ఓ మహాత్మా! నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. సంపదలు, కోరికలు, కీర్తి, జీవనాధారం వీటిలో ఏది కోరి వచ్చినా ఇస్తానని ప్రకటించి యుంటిని. ఇప్పుడు ధనంపై దరాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చినమాట తప్పుటకన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి దుర్మార్గున్నైనా భరించగలను కాని, ఆడినమాట తప్పినవాడిని మాత్రం మోయలేనని బ్రహ్మతో పలికిందికదా! యుద్దంలో వెనుదిరిగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైనవారికి మేలైన మార్గాలు.
0 comments:
Post a Comment