1. దానశీలం
కవి - బమ్మెర పోతన
(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)
పద్యం 12 (చదవండి)
బలి చేసిన దానమునకు
నలినాక్షుడు నిఖిల భూత నాయకు డగుటం
గలకల మని దశ దిక్కులు
బళిబళి యని పొగడె భూత పంచకమనఘా!
పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
బలి చేసిన దానమునకు-
నలినాక్షుడు- నిఖిల భూత నాయకుడు- అగుటన్
కలకలము- అని- దశ దిక్కులు-
బళిబళి అని- పొగడె- భూత పంచకము- అనఘా!
పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)
నలినాక్షుడు = నలినముల(తామర) వంటి కండ్లు కలవాడు(విష్ణువు)
నిఖిల = సమస్త
భూతనాయకుడు = జీవులకు ప్రభువు
భూతపంచకము = పంచభూతాలు
అనఘా = మహాత్మా! (పుణ్యాత్మా)
పద్య భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
భావం: (చదవండి)
ఓ పుణ్యాత్మా(పరిక్షిత్తు మహారాజా)! సకల ప్రాణులకూ విష్ణువే అధిపతి. అలాంటి విష్ణువుకే బలిచక్రవర్తి దానమియ్యడం చూసి పదిదిక్కులూ, పంచభూతాలూ బళి బళి అని పొగడాయి.
0 comments:
Post a Comment