22 May 2021

దానశీలం 10వ తరగతి తెలుగు పద్యం-11 రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం మరియు అర్థం చేసుకోవడానికి శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారిచే

1. దానశీలం 

కవి - బమ్మెర పోతన

(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)

వచనం:  ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు సేసి వామపాదంబు కడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని, వార్చి దేశకాలాది పరిగణనంబు సేసి..

కఠినపదాలు:

ధరణీసురుడు    =  బ్రాహ్మణుడు

దక్షిణ చరణం    = కుడిపాదం

ప్రక్షాలనంబు   =   కడగడం

వామ పాదంబు   =  ఎడమపాదం

పావన జలంబు    =  పవిత్ర జలం

శిరంబునన్      =  తలపై

వార్చి      =  ఆచమనం చేసి

పరిగణనంబు సేసి   =  సంకల్పం చెప్పి

భావం:  ఈ రకంగా ఆ బ్రాహ్మణుడి కుడిపాదాన్ని కడిగి ఆ పావన జలాన్ని తలపై చల్లుకున్నాడు. ఆచమనం చేసి దేశ కాలాలను గుర్తుచేస్తూ సంకల్పం చెప్పాడు. 

పద్యం  11 (చదవండి)

విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే

ద ప్రామాణ్యవిదే త్రిపాదధరణీం దాస్యామి యంచుం గ్రియా

క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాచి పూజించి బ్ర

హ్మ ప్రీతమ్మని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందగన్

పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


భావయుక్తంగా:(చదవండి)

విప్రాయ- ప్రకటవ్రతాయ- భవతే- విష్ణుస్వరూపాయ- వే

ద ప్రామాణ్యవిదే-  త్రిపాదధరణీం - దాస్యామి అంచున్- క్రియా

క్షిప్రుండై -దనుజేశ్వరుండు- వడుగున్-  చేసాచి పూజించి- బ్ర

హ్మ ప్రీతమ్ము - అని ధారవోసె- భువనంబు - ఆశ్చర్యమున్ పొందగన్

పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)

విప్రాయ     =   బ్రాహ్మణుడవు

ప్రకటవ్రతాయ   = వ్రతదీక్ష కలవాడవు

భవతే    =  నీవే

విష్ణుస్వరూపాయ    =   విష్ణుస్వరూపుడవు

వేద ప్రామాణ్యవిదే     = వేదాల ప్రమాణతను తెలిసినవాడవు

త్రిపాద ధరణీం     =  మూడడుగుల నేలను

దాస్యామి      =  దానం చేయుచుంటిని

క్రియాక్షిప్రుండై     =  ఆచరిస్తున్నవాడై

దనుజేశ్వరుండు   = రాక్షసరాజు

వడుగు       =    బ్రహ్మచారి

బ్రహ్మప్రీతమ్ము   = పరమాత్మ(బ్రహ్మ)కు  ప్రీతి కలుగు

భువనం      =    లోకం

పద్య  భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావం: (చదవండి)

         బలిచక్రవర్తి చేతులు సాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధ వ్రత దీక్షను స్వీకరించిన వాడవు, విష్ణుస్వరూపుడవు, వేదాల ప్రమాణతను తెలిసినవాడవు అయిన నీకు మూడడుగుల నేలను దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మ(బ్రహ్మ)కు ప్రీతి కలుగుగాక అంటూ చేతిలో నీటిని ధారవోశాడు. అది చూసి లోకమంతా ఆశ్చర్యపడింది.


1.
వామనుని అసలు స్వరూపం ?
This quiz has been created using the tool HTML Quiz Generator

0 comments:

Latest Updates

Class 10

View more »

Class 9

View more »

Class 8

View more »

Download Text Books n others

View more »

Top