1. దానశీలం
కవి - బమ్మెర పోతన
(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)
పద్యం 10 (చదవండి)
సురలోక సముద్ధరణము
నిరత శ్రీ కరుణ మఖిల నిగమాంతాలం
కరణము భవసంహరణము
హరిచరణము నీట గడిగె నసురోత్తముడున్
పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
సురలోక సముద్ధరణము-
నిరత శ్రీకరుణము- అఖిల - నిగమాంత అలం
కరణము- భవసంహరణము-
హరిచరణము - నీటన్ కడిగెన్- అసుర
ఉత్తముడున్
పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)
సురలోకం = దేవలోకం
సముద్ధరణము = ఉద్దరించేది (కాపాడేది)
నిరతం = ఎల్లప్పుడు
శ్రీ కరుణము = సంపదలు కురిపించేది
అఖిల = సర్వ
నిగమాంతాలు = ఉపనిషత్తులు (వేదాంతాలు)
అలంకరణము = అలంకారమైంది
భవసంహరణము = జన్మ లేకుండా చేసేది (మోక్షాన్ని ఇచ్చేది)
హరిచరణము = విష్ణుమూర్తి పాదం
నీటన్ = నీటితో
అసురోత్తముడు = రాక్షస శ్రేష్ఠుడు (బలిచక్రవర్తి)
పద్య భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
భావం: (చదవండి)
దేవలోకాలను ఉద్దరించగలిగేది, ఎల్లప్పుడూ సంపదలు కురిపించేదీ, సర్వ ఉపనిషత్తులకు అలంకారమైనదీ, మోక్షాన్ని ప్రసాదించగలిగేదీ అయిన ఆ వామన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు కుడిపాదాన్ని బలిచక్రవర్తి నీటితో కడిగాడు.
0 comments:
Post a Comment