02 September 2020

WORKSHEETS - ఉపయోగించడం ఎలా? (Telangana) for all Classes

 Good day to you all!

What are worksheets? How do we utilize WORKSHEETS? What is level-1 for? What is level-2 for? How to manage digital lessons and worksheets simultaneously?

ఈ worksheets ఏమిటి? వాటిని ఎలా వినియోగించాలి? లెవల్ 1 ఏమిటి? అలాగే లెవల్ 2 ఏమిటి? డిజిటల్ పాఠాలతో worksheetsను ఏలా అనుసంధానించాలి? ఇవన్నీ అవసరమా? ఇలాంటి ఎన్నో సందేహాలు మీలో మెదలి ఉంటాయి కాదా? చాలామంది ఉపాద్యాయ మిత్రులు అడిగిన ప్రశ్నలివి. నావంతుగా ఇలాంటి సందేహాలకు సమాధానం పొందుటకు సహకరించే ప్రయత్నమే ఈ రచన.

ముందుగా ఎందుకీ ప్రహసనం? కరోనా విపత్తు సందర్భంలో విద్యాసంస్థలు మూతబడి ఉండడం వలన విద్యార్థులు విద్యా వ్యాసాంగానికి చాలాకాలంగా దూరమైనది అక్షర సత్యం. మరికొంత కాలం వరకు కూడా పాఠశాలలు తెరిచే అవకాశాలు కన్పించడం లేదన్నది నిర్వివాదాంశం. కొంతకాలం వరుసగా పాఠశాలకు హాజరు కాకుంటేనే పిల్లలు వెనుకబడటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది చాలాకాలం విద్యకు దూరం కావడం వలన ఆసక్తి సన్నగిల్లడం, ఇతర వ్యాపకాలకు అలవాటు పడటం, చివరకు drop out గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులలో సైతం మన పిల్లలను విద్యా వ్యాసాంగంలో నిమగ్నం చేయడానికి, ఆసక్తి రేకెత్తించడానికి, విద్యకు దూరంకాకుండా ఉంచడానికి మనందరం చేసే ప్రయత్నమే ఇది. ఇప్పటికే చాలా మంది ఉపాధ్యాయులు తమకు తోచిన విధంగా ఏదో రూపంలో బోదన కొనసాగిస్తున్నారనడంలో సందేహం అనవసరం. మరికొందరికి ఏదో చేయాలని ఉన్నా కొంత Technology పైన అవగాహన లేకపోవడం వలన కొన్ని organizations మరియు విద్యాశాఖ కూడా కొంత అవగాహనా కార్యక్రమాలు online లో నిర్వహించడం జరిగింది. ఇంకా కొనసాగుతూంది కూడా.

          ఈ worksheets ఏమిటి? తెలంగాణ విద్యాశాఖ వారి సమగ్రశిక్షా కార్యక్రమంలో భాగంగా SCERT Hyd వారి సారధ్యంలో ఈ worksheets తయారు చేయడం జరిగినది. ఇవి ఒక క్రమాన్ని, పద్దతిని, నియమాన్ని అనుసరించి చేయడం జరిగినవి. దీనికోసం వందల సంఖ్యలో Root level teachers పాల్గొని ఇంటివద్దే worksheets తయారు చేయడం జరిగినది. ఎంత మంచి కార్యక్రమమైనా ఏదో వెలితి ఉండడం సహజమే కదా? కాబట్టి positive side ను దృష్ఠిలో ఉంచుకుని worksheets యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రయత్నం చేద్దాము. ఏ విషయానికి అయినా లేదా వస్తువుకు అయినా 100% నిరర్థకత ఉండదు కదా?

          లెవల్ 1 ఏమిటి? అలాగే లెవల్ 2 ఏమిటి? ఇక విషయానికి వస్తే ప్రతీ తరగతికి అలాగే ప్రతీ విషయానికి సంబందించి worksheets రెండు రకాలుగా తయారు చేయడం జరిగినది. మొదటిది లెవల్ 1 అనంతరం లెవల్ 2.

          లెవల్ 1 అనేది గత తరగతికి సంబందించిన పాఠ్యాంశాల ఆధారంగా రూపొందించబడినవి. అంటే పున:శ్చరణ (Recapitulation) అన్నమాట. మొదటగా లెవల్ 1 కు సంబందించిన worksheets ప్రాక్టీస్ చేయించాలి. అందులోని అంశాలు తదుపరి అంటే ప్రస్తుతం విద్యార్థి చదివే తరగతిలోని అంశాలు నేర్చుకొనుటకు ఉపకరిస్తాయి కదా? Basic knowledge ఏ తరగతికి అయినా అవసరమన్నది జగమెరిగిన సత్యమే.

          ఇక లెవల్ 2 గురించి. ఇవి విద్యార్థి ప్రస్తుత తరగతికి సంబందించినవి. ఇవి ఆ తరగతికి సంబందించిన ఆ సబ్జెక్టుకు చెందిన మొదటి కొన్ని పాఠ్యాంశాలకు సంబందినవి. కొంతకాలంగా ఏదో రూపంలో విద్యార్థులను busy గా ఉంచే ప్రయత్నాలు అయితే మనలో చాలా మంది చేస్తున్నారన్నది ఉపాద్యాయునికి ఉన్న నిబద్దతకు తార్కానం అన్నది మరువరాదు. ఇక తెలంగాణ విద్యాశాఖ కూడా సవివరమైన schedule రూపొందించి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించింది.

          డిజిటల్ పాఠాలతో worksheetsను ఏలా అనుసంధానించాలి? ఇక్కడే చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఏది ముందు? ఏది తరువాత? డిజిటల్ పాఠాలతో worksheetsను ఏలా అనుసంధానించాలి? అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. దానికోసం డిజిటల్ పాఠాల schedule ను పరిశీలించాలి. ఒక సబ్జెక్టుకు వరుసగా వారం మొత్తం కూడా పాఠాల బోదన లేదు. కాబట్టి ఆ తరగతికి సంబందించిన ఆ సబ్జెక్టుకు సంబందించిన పాఠ్యాంశం బోదన జరిగినప్పుడు దానికి సంబందించిన worksheet లెవల్ 2 ను విద్యార్థులకు పంపించి చేయించడం ఉత్తమం. అలాగే ఆ సబ్జెక్టుకు సంబందించిన పాఠ్యాంశం బోదన లేని రోజున లెవల్ 1 కు సంబందించిన worksheet పంపించి చేయించడం బాగుటుందని నా అభిప్రాయం.

          డిజిటల్ పాఠాలే చూపించాలా? ఇది మరొక సందేహం. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులకు సంబందించి ఇంగ్లీషు మీడియం పాఠాలు ప్రసారం కాకపోయే అవకాశం అయితే ఉంది. అలాంటపుడు మరి వారికి ఎలా? దీని కోసం మనమే సొంతంగా రకరకాల మాద్యమాల ద్వారా కేటాయించిన సమయంలో బోదించవచ్చును. లేదా వీడియో, ఆడియో పాఠాలు మనమే రూపొందించి పిల్లలకు చేరవేయవచ్చును. లేదా Youtube, Google, లేదా ఇతర మాద్యమాలలో ఉపయుక్తంగా ఉన్న, ఇతరులు రూపొందించిన పాఠాలను చేరవేయవచ్చును. ఇంకా ఎన్నో అవకాశాలు మీ మదిలో ఉన్నవి అమలు చేయవచ్చును. కానీ మన అంతిమ లక్ష్యం మన విద్యార్థిని విద్యావ్యాసాంగంలో మమేకం చేయడమే.

          ఇది కేవలం నాకు తోచిన విషయాన్ని, నాకు అర్థమయిన విషయాన్ని మీతో పంచుకోవడానికి మాత్రమే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సరైన విషయాలను ప్రభుత్వ విద్యాశాఖ వారి నిబందనలు చదివి అనుసరించగలరు. మీ అభిప్రాయాలను కామెంట్సు రూపంలో పంచుకొంటారని ఆశిస్తున్నాను.

          ధన్యవాదాలు.

మీ

హరినాథ్ వేముల

www.english143.in

https://ssc.english143.in

https://www.youtube.com/c/HarinathVemula 

3 comments:

vasuarya said...

How to send worksheets to students
Physically or digitally??

vidya sagar said...

Thank you sir, Your analysis about using worksheets is quite useful.

HARINATH VEMULA said...

Vasuarya
If there is a source available to send physically, you can send physically else you can send digitally.

Latest Updates

Class 10

Class 9

Class 8

Class 7

Class 6

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Children's Work

Top