03 August 2020

Attitude is Altitude తెలుగు అనువాదం - The complete lesson in Telugu

Attitude is Altitude తెలుగు అనువాదం - The complete lesson in Telugu

    The lesson, Attitude is Altitude, is translated into Telugu as some friends asked me. Hope you find it useful.

వైఖరియే ఉన్నతి

ఒకసారి ఊహించుకో, చేతులు లేనట్లైతే ప్రొద్దున్నే ఎలా మబ్బిరుస్తావు? దురద ఉన్నచోట ఎలా గోక్కుంటావు? నీకు ఇష్టమైనవారిని ఎలా చుట్టేస్తావు? అలాగే కాళ్లు లేవని ఊహించుకో, వీధిలో వెళ్తున్నపుడు గుళకరాళ్లని ఎలా తంతావు? ఎలా పరుగెడతావు, నడుస్తావు,? ఒక చోటునుండి మరొకచోటుకి ఎలా వెళతావు? ఇప్పుడు రెండూ లేవని ఊహించుకో. నిక్ వూయీచిచ్ అలాంటి స్థితినే జీవితపర్యంతం అనుభవిస్తున్నాడు. ఇలాంటిది ఎప్పుడైనా విన్నావా?

నిక్ వూయీచిచ్ కాళ్లూ, చేతులూ లేకుండా జన్మించాడు. కానీ అవేవీ అతన్ని ఆపలేకపోయాయి. ప్రధానంగా మొండెము అయిన నిక్ వూయీచిచ్, 26 సంవత్సరాల యువకుడు, ఫుట్ బాల్, గోల్ఫ్ ఆడతాడు. అతను కాళ్లూ, చేతులూ లేకున్నా ఈదగలడు, సర్ఫింగ్ చేయగలడు.

నిక్ వూయీచిచ్ కు తన ఏడమ తుంటికి ఒక చిన్నపాదం ఉంది. అది అతడిని నిలబడానికి, కదలడానికి సహాయపడుతుంది. నిక్ అతని చిన్న పాదంచేత టైపు చేస్తాడు. పెన్ లేదా పెన్సిల్ ను తన పాదం వేళ్లమద్య ఉంచి రాస్తాడు.

అది నా చికెన్ డ్రమ్ స్టిక్, అని జోక్ చేస్తాడు. ఇతను ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో జన్మించాడు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉంటున్నాడు. అది లేకుంలే నన్ను నేను కోల్పోయేవాడినిఅంటాడు.

ఇవాంజిలికల్ క్రిస్టియన్ వలె విశ్వాసం కల్గియున్న నిక్ వివాహం జరిగేవరకు కన్నెగా ఉండాలని నిశ్చయించుకున్నడు.

వాడు చాలా నమ్రతగల వాడు. కానీ ఎప్పుడూ మహిళల నుండి వివాహ ప్రతిపాదనలు పొందుతాడు అన్నాడు ప్రచారకర్త అయిన నిక్ స్నేహితుడు స్టీవ్ ఆపెల్.

అతనికి వివాహం చేసుకుని కుటుంబం ప్రారంభించాలని ఉత్సాహం ఉన్నప్పటికీ సరైన మహిళ కోసం ఎదురు చూస్తున్నాడు.

నిక్ కు water sports తోపాటుగా ఫుట్బాల్ ఆటయైన English Premier League కూడా ఇష్టమే. అతను తన గదవ క్రింద గోల్ఫ్ క్లబ్ ను నొక్కి ఉంచి గోల్ఫ్ ఆడతాడు.

అతని తల్లిదండ్రులు నిక్ ను ప్రత్యేక పాఠశాలకు పంపకూడదని నిర్ణయించారు – అది అతనికి క్లిష్టమైనదే కానీ అది వారి నిర్ణయాల్లో కెల్లా గొప్పది.

నిక్ జన్మంచినపుడు అతని తండ్రి దిగ్బ్రాంతికి గురై ఆసుపత్రి నుండి వాంతి చేనుకోవడానికి వెళ్లాడు.

మానసిక వ్యదలో ఉన్న అతని తల్లి అతడిని నాలుగు నెలల వరకు ఒడిలోకి చేర్చుకోలేకపోయింది.

అతని వికలత్వానికి వైద్యశాస్త్రంలో వివరణ లేదు – అసాధారణంగా సంభవించే ఫోకోమీలియా అని మాత్రమే చెబుతుంది – నిక్ తోపాటు అతని తల్లిదండ్రులు వారికే ఎందుకు ఇంత కౄరమైన శిక్ష విధించారని ప్రశ్నిస్తూ గడిపారు. మా అమ్మ ఒక నర్సు. ఆమె గర్భిణిగా ఉన్నపుడు అన్నీ సవ్యంగానే చూసుకుంది అయినా నేటికీ తనని తానే నిందించుకుంటుంది అంటాడు నిక్.

నన్ను స్వతంత్రునిగా చేయడం వారికి చాలా కష్టమైన విషయమే అయినా మొదటి నుండి వారు నా కోసం సరైన నిర్ణయాలనే తీసుకున్నారు.

మా నాన్నగారు నాకు 18 నెలల వయస్సపుడు నన్ను నీళ్లలో ఉంచి ఈత నేర్చుకునే ధైర్యం ఇచ్చారు.

నాకు ఫుట్ బాల్ మరియు స్కేట్ బోర్డింగ్ లో ప్రవేశం ఉంది. అలాగే నేను The English Premier League అనే ఫుట్ బాల్ ఆటలకు వీరాభిమానిని.

నిక్ తండ్రి ఒక computer programmer మరియు accountant, అతను తన పుత్రునికి 6 సంవత్సరాల వయస్సులో తన చిన్న పాదం వేలితో టైపు చేయడం నేర్పాడు. అతని తల్లి ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ పరికరాన్ని తయారు చేయడం ద్వారా నిక్ తన చిన్న పాదంతో పెన్ లేదా పెన్సిల్ పట్టుకునేలా చేసింది.

వారి పుత్రున్ని గేలిచేసి ఆట పట్టించే అవకాశాలు ఉన్నా కూడా వారు నిక్ ను సాధారణ పాఠశాలకే పంపించారు. అది వారు తీసుకున్న గొప్ప నిర్ణయం మరియు నాకు కఠినమైనది కానీ నన్ను స్వతంత్రుడిని చేసింది అంటాడు నిక్, అతనే అనంతరం తన Financial Planning and Real Estate డిగ్రీని పూర్తిచేసాడు.

గేలిచేసి ఆట పట్టించబడ్డ నిక్ కు తాను ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళడానికి ఒక electric wheelchair ఉంది. అలాగే అతనికి సహాయం చేయడానికి కొంతమంది సేవకులు కూడా ఉన్నారు.

ఒకసారి మానసికంగా అణగారిపోయిన నేను మా అమ్మ దగ్గరకు ఏడుస్తూ వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతాను" అంటాడు నిక్.

మా తల్లిదండ్రులు లేనట్లైతే ఎలా ఉండేదనిపించి చాలా ఆందోళన చెందుతూ భగవంతుని ద్వేశించాను.

గోడకు ఉంచబడిన బ్రష్ తో నా దంతాలు నేనే తోముకోగలను. అలాగే pump action soap తో నా తలను రుద్దుకోగలను. కానీ నా వల్లకానివి ఇంకా ఎన్నో ఉన్నాయి.

10 సంవత్సరాల వయసులో నిక్ స్నానాల కుండీలో మునిగి ఆత్మహత్య చేసుకోవడానికి విఫల ప్రయత్నం చేసాడు. నేను ఎందుకూ పనికిరాను అనిపించింది. శక్తి, సామర్థ్యాలు అలాగే ప్రయోజనం లేనపుడు ఇక ఉండి ఏం లాభం అని ప్రశించాడు. కానీ అతని మతం, స్నేహితులు మరియు తల్లిదండ్రుల సహాయ సహకారాలతో కష్టాలను అధిగమించి నేడు విధి ప్రతికూలతలపై విజయ సాధనకు ఒక అంతర్జాతీయ గుర్తింపుగా ఎదిగాడు.

నాకు 13 సంవత్సరాల వయస్సపుడు ఒక పత్రికలో ఒక వికలాంగుడు సాధించిన ఘనతను చదివాను. అది నా అలోచనా విధానాన్నే మార్చేసింది.

భగవంతుడు ఇతరులకు వారి జీవితాలపై ఆశలు కల్పించానికే నన్ను పుట్టించాడు. అందుకే నాకు ఎలాగైతే ఆ వార్తాకథనం ధైర్యం కల్పించిందో అలాగే నా జీవితాన్ని ఇతరులకు ధైర్యం కల్పించడానికి అంకితం చేస్తాను.

నాలో ఏదైతే ఉందో దానికి కృతజ్ఙునిగా ఉంటాను, కానీ లేనివాటి గురించి చింతించను.

అద్దంలో నన్ను నేను చూసుకుని ఇలా చెప్పుకుంటాను: ప్రపంచం అంతా నాకు కాళ్ళు చేతులు లేవంటుంది – నిజమే – కానీ వారు నా కళ్లలోని అందాన్నితొలగించలేరు కాదా. అపుడు నాకు ఉన్నదానిపైనే దృష్టి పెడతాను.

జీవితంలో సవాళ్ళు మన విశ్వాసాలను, నమ్మకాలను బలపరచడానికి వస్తూనే ఉంటాయి, కానీ మనల్ని తొక్కేయడానికి మాత్రం కాదు అంటాడు నిక్. 1990 లో విజయం సాధించడంలో పట్టుదల, ధైర్యాలకు గానూ నిక్ ను the Australian Young Citizen of the Year award వరించింది.

ఓ సారి నేను కార్ లో ఉండగా ఒక అమ్మాయి ఇష్టంగా చూస్తూంది. ఆమె నా తలను మాత్రమే చూడగలదు. ఆమె సరదా తీరుద్దామని కార్ సీటులో గుండ్రంగా తిరిగాను. అంతే ఆమె ముఖం చూడాలి .... ఏం జరుగుతోంది అనుకుంటూ పారిపోయింది

నిక్ ప్రపంచ యాత్రకు బయలుదేరాడు. 2008 లో హవాయి లో బెథానీ హ్యామిల్టన్ అనే సర్ఫింగ్ విద్య నేర్పే గురువును కలిసాడు. ఆమె 12 సంవత్సరాలపుడు ఆమె చేయి షార్క్ చే తినివేయబడినది.

ఆమె ఒక అద్భుతం. ఆమే నాకు సర్పింగ్ నేర్పింది. మొదట్లో నేను బయపడ్డాను కానీ ఒక సారి చూస్తే అలలను ఇట్టే పట్టేసాను. నిక్ తొందరగానే సర్పింగ్ లో 3600 తిప్పడం నేర్చుకున్నాడు. 48 గంటల్లోనే తనని Surfer magazine కవర్ పైకి చేరేలా చేసింది. సర్ఫింగ్ చరిత్రలోనే ఎవరూ సాధించనిది కాళ్ళూ చేతులూ లేకపోవడం వలన నాపై భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వలన జరిగింది.

నిక్ చాలా దేశాలు సందర్శంచాడు. ఫుట్ బాల్ అభిమాని అయిన నిక్ నేడు గొప్ప ప్రోత్సహించే వక్తగా మారాడు. అతను సుమారుగా 24 దేశాలలోని 1,10,000 మందితో మాట్లాడినాడు.

2007లో లాస్ ఏంజిల్స్ కు మకాం మార్చిన నిక్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

నేను ఓడితే మళ్ళీ ప్రయత్నిస్తాను, మళ్ళీ ప్రయత్నిస్తాను, మళ్ళీ ప్రయత్నిస్తాను, గెలిచేంత వరకు, మరి మీరు? మన మనస్సు మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే సంభాళించుకుంటుంది. అది కేవలం నీవెలా ముగిస్తామన్నదే ముఖ్యం. మరి నీవు గొప్పగా ముగిస్తావా?” అని అడుగుతాడు నిక్.

పడిపోయినపుడల్లా లేస్తూనే ఉండాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి అని చెబుతాను. నేను ఒక్కరిని ఉత్సాహపరచినా ఈ జీవితంలో నా పని పూర్తయినట్టే.

మరి పదవ తరగతి వరకు చేరుకున్న నీ సంగతి ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి? నీ గమ్యం ఏమిటి? పడిపోతే ఏమి చేస్తావు? నిక్ జీవితం నుండి ఏమి నేర్చుకున్నావు? కాళ్లూ చేతులు లేకుండానే ప్రపంచానికి గొప్ప ప్రోత్సహించే వక్తగా మారాడు. మరి అన్నీ ఉన్న నీ సంగతి ఏమిటి? ఒక్క ఆలోచన నీ జీవితాన్నే మార్చేస్తుంది. మన మాజీ రాష్ట్రపతి శ్రీ కలాం గారు చెప్పినట్టు కలలు కను. దానికై ఆలోచించు. ఆలోచనలో నుండి ఆచరణకు దిగు. అంతే ఫలితం గురించి దిగులు చెందకు. శ్రమకు తగిన ఫలితం ఎప్పుడూ సంభవమే.

(కొంతవరకు) అనువాద ప్రయత్నం నచ్చితే Share చేయండి : Harinath Vemula

Download కొరకు ఇక్కడ click చేయండి

5 comments:

Unknown said...

Excellent sir. Thank u so much sir for your great work

Unknown said...

Super sir .thank you so much sir
Excellent .. wonder ful creation. Great teacher in the my life sir I never forget my life sir..

Vasanth said...

Good translation, sir!

Anonymous said...

Excellent sir keep it up if possible make a video with explanation in telugu.

Unknown said...

Exceĺlent effort Harinath garu. GOD Bless you.Giriprasad

Latest Updates

Class 10

Class 9

Class 8

Class 7

Class 6

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Children's Work

Top